Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 2:59 pm Posted by : ramakrishna

కమీషన్ల కోసం పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేయడం వల్ల ఎవరికి లబ్ధి జరిగింది.?

అందరం బాధ్యతగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది

హైదరాబాద్, బతుకమ్మ :  బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేయడం వల్ల ఎవరికి లబ్ధి జరిగిందని ప్రశ్నించారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా..? లేక ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా.? అని నిలదీశారు.  కేసీఆర్ చేసిన అప్పులకు నెల నెలా కోట్లాది రూపాయలు మిత్తి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకుండా మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరం బాధ్యతగా పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని సూచించారు.