Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 6:24 pm Posted by : ramakrishna

యూరియా సమస్య ప్రతి సంవత్సరం ఉండేదే

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యూరియా అనేది ప్రతి సంవత్సరం ఉండే సమస్యనే అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రైతులు అడుగుతూనే ఉంటారు, ప్రభుత్వం సప్లై చేస్తూనే ఉందని తెలిపారు. స్టేట్ కి కేంద్రం ఇవ్వవలసిన కోటా ఇవ్వమని అడుగుతున్నాం ఎక్కువ ఏమడగడం లేదన్నారు. అది ఇవ్వకుండా ఎందుకు నాటకాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. యూరియపై కేంద్రం ఆడుతున్న అంతా నాటకం అని తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఏమి అర్థమయ్యిందో మాకు తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కంటే తక్కువ సబ్సిడీకి ఇస్తున్నారని తెలిపారు. జాతీయ పార్టీ అయినప్పుడు జాతీయ స్థాయి నిర్ణయాలు తీసుకునేటట్లు ఉండాలన్నారు. ధైర్యం ఉంటే  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అసలు జాతీయ పార్టీనో….ప్రాంతీయ పార్టీనో అన్నది అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కెసిఆర్ ఇద్దరు కూడా దొంగలే ఆపార్టీ కి క్లారిటీ లేదని అన్నారు. ఆనాడు తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని కేసీఆర్ చెప్పాడని తెలిపారు. మోడీ వస్తే కేసీఆర్ మాయమాటలు చెప్పాడన్నారు. మీపార్టీ సెక్యులర్ పార్టీ అనుకుంటే సుదర్శన్ రెడ్డి కి సపోర్ట్ చేయండని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ కావాలని పోరాటo చేసిన వ్యక్తి అని అన్నారు. సుదర్శన్ రెడ్డి ఒక కులానికో లేదా మతానికో, ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదన్నారు.