యూరియా యాప్ ను పూర్తిగా తొలగించాలి
బోధన్, బతుకమ్మ : యూరియా యాప్‌ను పూర్తిగా తొలగించాలని లేదా సంఘ పరిధిలోని గ్రామాలకు మాత్రమే పరిమితం చేసే విధంగా సవరణ చేయాలని ఏ. రవీందర్ అన్నారు. బోధన్‌లోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశం ఏ.రవీందర్ (అఫీషియల్ పర్సనల్ ఇన్‌చార్జ్) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి జమా-ఖర్చుల పట్టికతో పాటు సంఘ లావాదేవీల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్కల కొనుగోలు కేంద్రాన్ని...