Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 6:09 pm Posted by : ramakrishna

బహుజన శ్రామిక వర్గ ఐక్యతే మేడే అమరవీరులకు నివాళి

 

. . . బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రపంచ శ్రామిక వర్గ హక్కుల సాధన దినోత్సవం” మేడే” అమరవీరుల స్పూర్తిని భారత బహుజన కార్మిక వర్గ ఐక్యత సాధనే లక్ష్యంగా ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ లో బీఎల్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్ది రాములు అధ్యక్షతన ఆదివారం మేడే అమరవీరుల స్పూర్తి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ బహుజన కార్మిక వర్గ వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు, రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయాలని పార్లమెంట్ లో చట్టం చేస్తూ, బహుజన శ్రామిక వర్గాన్ని అణిచివేసేందుకు కుట్రలు పన్నుతున్న ఉత్తరాది ఆధిపత్య అంబానీ, ఆదాని పెట్టుబడిదారులకు, దోపిడి వర్గాలకు కొమ్ము కాస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్.సిద్ధి రాములు మాట్లాడుతూ మేడే వారోత్సవాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంలోని బీడీ, మున్సిపల్ గ్రామ పంచాయతీ హమాలీ ఆటో ట్రాన్స్ పోర్ట్ భవన నిర్మాణ కార్మికులు సమాన పనికి సమాన వేతనం సాధన కోసం సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత మాట్లాడుతూ కేంద్రంలో మహిళా రిజర్వేషన్ బిల్లులో బహుజన కులాల మహిళలకు వాటా లేకుండా ఆధిపత్య కులాల యాజమాన్యంలోని అగ్రవర్ణ అగ్రకుల మహిళాలకు ప్రయోజనం కలిగించే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాలనే కుట్రలు పన్నుతున్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో బిల్లును ఓడించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలారి ప్రవీణ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.ఆనంద్, జిల్లా అధ్యక్షులు తల్లారే సంజయ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బిఎల్ టీయూ జిల్లా ప్రధాన మేకల రాజేందర్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గౌడెల్లి గంగా శంకర్, ప్రధాన కార్యదర్శి ఎం.మక్కల ఎల్లయ్య, నాయకులు నవీన్, బిఎల్ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు యాటల అనిల్ కుమార్, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి.జగదీష్, బహుళజన బీడీ టేకేదర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.పొశెట్టి, బిదాస్ గణేష్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర కమిటి సభ్యులు పాల్గొన్నారు.

 

The unity of the working class is a tribute to the martyrs of Mayday.