నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ , పి.జి, ప్రొఫెషనల్ కళాశాలల హ్యాండ్ బాల్ (పురుషుల మరియు మహిళల), ఎంపిక పోటీలను యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో ప్రారంభించామని వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్, డా. జి బాలకిషన్ తెలిపారు. ఈ క్రీడా ఎంపిక ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రో. ఘంట చంద్రశేఖర్, డైరెక్టర్ ఆడిట్ సెల్, హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రొఫెసర్. రాంబాబు, ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజీ, వివిధ కళాశాలల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి విశ్వవిద్యాలయానికి, మీ తల్లిదండ్రులకు, మీరు పుట్టిన నేలకు పేరు తీసుకురావాలని అభినందించారు. స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ ఎంపికైన పురుషుల జట్టు ఈ నెల 15న విఐటి వెల్లూరు, తమిళనాడులో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో పాల్గొంటారని, ఎంపికైన మహిళల జట్టు ఈ నెల 17న ఏంజియు కొట్టాయం, కేరళ రాష్ట్రంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ డా.రామ, రూప, అనిల్ కుమార్, క్రీడాకారులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బి.ఆర్ నేత, జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
