Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 4:29 pm Posted by : ramakrishna

ప్రమాదాల మూల మలుపు

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలో చిక్లి గ్రామ శివారులో గల రోడ్డు మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మూల వద్ద ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ మూల మలుపు వద్ద ఎన్నో వాహనాలు రోడ్డు పై నుండి కింద పడి ఎంతోమందికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి.వల్లాబాపూర్, చిక్లి గ్రామాలకు చెందిన వారు కూడా ఈ మూల మలుపు వద్ద మరణించడంతో మలుపు వద్ద చాలా భయపడుతుంటామని వారన్నారు. రోడ్డు మలుపు వద్ద సోమవారం లారీ బోల్తా పడి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. బుధవారం షిఫ్ట్ కార్ రోడ్డుపై నుండి పొలంలోకి పల్టీ కొట్టడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అధికారులు తక్షణమే స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు.

The turning point of accidents