Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 6:07 pm Posted by : ramakrishna

ఆధునిక సాంకేతికతతో కూడిన దేశాన్ని నిర్మించడమే నిజమైన నివాళి

 

. . . నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ భవన్‌లో మనం కేవలం రాజీవ్ గాంధీని స్మరించుకోవడమే కాదు… ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేయాలని, శాంతి, ఐక్యత, ఆధునిక సాంకేతికతతో కూడిన భారతదేశాన్ని నిర్మించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. గురువారం భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, వినాయక నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రామకృష్ణ, నగేష్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, మేయర్ ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ మే 21 మన దేశ చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన రోజని, భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహానాయకుడు, ‘భారత రత్న’, మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి అని, దేశం కోసం తన ప్రాణాలనే అర్పించిన ఆ అమరవీరుడికి ఈ సందర్భంగా మనం ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. రాజీవ్ గాంధీ కేవలం 40 ఏళ్ల వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టి, భారతదేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారన్నారు. ఆయనది యువ రక్తం, ఆధునిక ఆలోచనలు అని పేర్కొన్నారు.

 

The true tribute is to build a nation with modern technology.

 

ఈ రోజు మనం వాడుతున్న స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వీటన్నింటికీ పునాది వేసింది రాజీవ్ గాంధే అని, ఆయనే భారతదేశంలో “సమాచార సాంకేతిక విప్లవాన్ని” తీసుకొచ్చారన్నారు. నాటి ఆయన దూరదృష్టి వల్లే ఈ రోజు భారతీయ యువత ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌ వేర్ రంగంలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలని, ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత కూడా ఆయనదేనని, పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు స్వయంప్రతిపత్తిని, అధికారాలను కట్టబెట్టారన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తరుణంలో, ఉగ్రవాదం రూపంలో ఆయనను మనం కోల్పోయామని, ఆయన మరణం దేశానికి తీరని లోటని, అందుకే, రాజీవ్ గాంధీ బలిదానానికి గుర్తుగా ప్రతి ఏటా మే 21ని మనం “జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం” గా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. హింస, ఉగ్రవాదం వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం లేదని చాటిచెప్పడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమని, అలాగే రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం ప్రతీ సంవత్సరం జిల్లా మీదుగా రాజీవ్ సద్భావన యాత్ర, రాజీవ్ సంస్మరణ జ్యోతీ యాత్రా తమిళనాడు నుండి ఢిల్లీ వెల్లే క్రమంలో జిల్లాలో కూడా అట్టహాసంగా యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవస్తలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తారా చాంద్, కౌడపు శరత్, వేంపల్లి రత్నాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కంజర్ రవి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఏసీ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా చైర్మన్ తెడ్డు సృజిల్ బాబు, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, జావీద్ అక్రమ్, నగర కాంగ్రెస్ కోశాధికారి సకినాల శివ ప్రసాద్, రాజ్ గగన్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, అవిన్, సంగెం సాయిలు, పోలా ఉష, అపర్ణ, స్వప్న, బంటు బలరాం, రాజేంద్ర ప్రసాద్, రాజేందర్, గోవర్దన్, అష్రఫ్, ఆదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

The true tribute is to build a nation with modern technology.