Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 7:02 pm Posted by : ramakrishna

బాధితులకు సెల్ ఫోన్ ను అప్పగించిన ట్రాఫిక్ ఏఎస్సై  

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద హరిసింగ్ అనే వ్యక్తి అనారోగ్యంతో కిందపడిపోగా గమనించిన ఓ వ్యక్తి పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. హరిసింగ్ కోలుకున్న తర్వాత తన ఫోన్ కనిపించకపోవడంతో ధర్నా చౌక్ లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఏఎస్సై కోటేశ్వర్ రావుకి విషయం చెప్పాడు. అప్పటికే హరిసింగ్ భార్య హరిత తన భర్తకు ఫోన్ చేసినా  స్పందించకపోవడంతో ఆందోళన చెందింది. ట్రాఫిక్ ఏఎస్సై బాధితుడు హరిసింగ్  ఫోన్ మిస్సింగ్ పై విచారణ చేపట్టగా అర్సపల్లిలోని ఇలియాస్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. బాధితునికి హరిసింగ్  అతని భార్య హరితలకు ఏఎస్సై కోటేశ్వర్ రావు ఫోన్ అప్పగించారు. దీంతో ఏఎస్సై, ఇలియాస్ లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.