నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : ట్రాక్టర్ డ్రైవర్ కు హెవీ లైసెన్స్ లేదనే కోపంతో ట్రాక్టర్ ఓనర్ ను బోధన్ రూరల్ పోలీసులు చితక బాదారు. మంజీర పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు తనిఖీ చేశారు . సాలూరు మండలం మందర్న గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు ప్రశ్నించారు.త్వరలో లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంటానని సదరు డ్రైవర్ పోలీసులను బతిమిలాడగా అక్కడికి ట్రాక్టర్ యజమాని దిగంబర్ రాగానే పోలీస్ లు చితక బాదారు.లైసెన్స్ లేకుంటే లైసెన్స్ తీసుకోవాలని చెప్పాలి లేదా కేసు నమోదు చేయాలి. సీజ్ చేయకుండా ట్రాక్టర్ ఓనర్ ను దద్దులు వచ్చేలా లాఠీలతో కొట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బోధన్ డివిజన్ లో ఇసుక అక్రమ రవాణా పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ట్రాక్టర్, టిప్పర్ కు సపరేట్ గా డబ్బులు వసూలు చేస్తే గాని ఇసుక రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని ఆరోపణలు ఉన్నాయి. బోధన్ రూరల్ పోలీసుల అత్యుత్సాహంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.