Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:12 pm Posted by : ramakrishna

జర్నలిస్టుల హక్కుల కోసం టిజెఏ పోరాటం చేస్తునే ఉంటుంది

 

. . . టిజెఏ జిల్లా అధ్యక్షుడు జి.సాయి ప్రసాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తోందని టిజెఏ జిల్లా అధ్యక్షుడు జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు జర్నలిస్టు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ జెయు) అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టిజెఏ) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డిఎంఎసి) సభ్యుడు జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజేఏ వ్యవస్థాపకుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ, టీజేఏ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేయడం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం టీజేఏ చేస్తున్న పోరాటాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, పి. యశస్వి, పి. మురళీకృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.