Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 7:14 pm Posted by : ramakrishna

మూడవ విడత జిపీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరుగాలి

 

. . . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య

ఆర్మూర్, బతుకమ్మ :

గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని  నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అధికారులను అదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడవ విడత నిర్వహణపై ఆర్మూర్ ఎసీపీ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం  నిర్వహించారు.  ఈసంధర్బంగా పోలిస్ కమీషనర్ మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా అమలు అయ్యేలా చూడాలన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన,అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (విపిఓ)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏ.సి.పి  జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ గౌడ్ , ఆర్మూర్ రూరల్ సి. ఐ కె. శ్రీధర్ రెడ్డి , భీంగల్  సి. ఐ పి. సత్యనారాయణ గౌడ్ , బాల్కొండ ఎస్. ఐ కె. శైలేందర్  , నందిపేట్ ఎస్. ఐ జి. శ్యామ్ రాజ్ , వేల్పూర్ ఎస్. ఐ  బి. సంజీవ్ , ఎస్. ఐ ముప్కాల్  కిరణ్ పాల్ , మెండోరా ఎస్. ఐ సుహాసిని , భీంగల్ ఎస్. ఐ కె. సందీప్ , మోర్తాడ్  ఎస్. ఐ  బి. రాము , కమ్మర్ పల్లి ఎస్. ఐ జి. అనీల్ రెడ్డి , ఏర్గట్ల  ఎస్. ఐ పి. రాజేశ్వర్ , మాక్లూర్ ఎస్. ఐ రాజశేఖర్  తదితరులు పాల్గొనడం జరిగింది.

The third phase of GP elections should be held in a peaceful atmosphere