కారు అద్దాలను ధ్వంసం చేసి రూ. 8 లక్షలను ఎత్తుకెళ్లిన దుండగులు

  బాన్సువాడ, బతుకమ్మ :    బాన్సువాడ పట్టణంలో ఘరానా చోరీ జరిగింది. దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి రూ. 8 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు తన బంధువు హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మాధవరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాన్సువాడ శాఖలో తన ఖాతా నుంచి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో...