Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 7:39 pm Posted by : ramakrishna

కారు అద్దాలను ధ్వంసం చేసి రూ. 8 లక్షలను ఎత్తుకెళ్లిన దుండగులు

 

బాన్సువాడ, బతుకమ్మ : 

 

బాన్సువాడ పట్టణంలో ఘరానా చోరీ జరిగింది. దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి రూ. 8 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు తన బంధువు హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మాధవరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాన్సువాడ శాఖలో తన ఖాతా నుంచి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో రూ.8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న రిలయన్స్ స్మార్ట్  వద్ద కారును పార్క్ చేసి సరుకులు కొనడానికి వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రోడ్డుపై పట్టపగలు రూ.లక్షల్లో చోరీ జరగడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

 

The thieves broke the car windows and stole Rs. 8 lakhs.