ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బకొట్టాం
సైన్యానికి సెల్యూట్ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, బతుకమ్మ : ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చెప్పారు. ఆరరేషన్ సిందూర్ అనంతరం ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. న్యూ క్లియర్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే సహించేది లేదని పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు...