Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 12:45 pm Posted by : ramakrishna

పీయంజేలో దోంగల బీభత్సం

 

.. . .  సిబ్బందిపై కాల్పులు

. . .  నగల దోచిన నలుగురు ముఠా

 కరీంనగర్, బతుకమ్మ:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. తుపాకులతో సాధరణ కస్టమర్ ల మాదిరిగా పియంజే జ్యువెలర్స్ లో చొరబడి నగలను దోచుకు పోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన నలుగురు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి అందిన కాడికి దోచుకెళ్లారు. సినిమా పక్కి లో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలో జ్యోతి నగర్ లో గల పియంజే నగల దుకాణంలో ఆదివారం  ఉదయం లాకర్ లు తెరిచి  నగలు సర్దుతున్న సమయంలో జరిగిన దోపిడీ కలకలం రేపింది. దొంగల కాల్పుల్లో గాయపడిన వారిని స్థానికులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. తుపాకుల కాల్పులు, దొంగతనంతో పియంజే జ్యువెలర్స్ షాప్ లో నిమిషాల వ్యవధిలోనే తమ పని కానిచ్చి అగంతకులు పరారీ అయ్యారు. స్థానికంగా ఖాళీ తూటాలను స్వాధినం చేసుకున్నారు. యజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. వెలి ముద్ర, ఆనవాళ్లను గుర్తించడంతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. పరారీ అయిన నలుగురు కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నగల షాప్ లో దొంగతనం యత్నం అంతరాష్ట్ర ముఠా పని కావచ్చు పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యం ముందుగా రెక్కి నిర్వహించిన తరువాతనే దోపిడికి ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు