తెలంగాణ పోరాటాన్ని భావి తరాలకు తెలియజేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిరిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బుధవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి ధన్ పాల్ సూర్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశనికి స్వాతంత్రం లభిస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట...