Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 5:09 pm Posted by : ramakrishna

తీజ్ పండుగ సమాజంలో ఐక్యత ని పెంపొందిస్తుంది

 

. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తీజ్ వంటి సంప్రదాయ పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. నిజామాబాద్ నగర తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన గోర్ బంజారా తీజ్ ఉత్సవ కార్యక్రమానికి మేయర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన మేయర్‌ను తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తీజ్ ఉత్సవం యొక్క ప్రాముఖ్యత, గోర్ బంజారా సమాజంలో దాని సాంస్కృతిక, సామాజిక విలువలను కమిటీ సభ్యులు మేయర్‌కు వివరించారు.

 

The Teej festival fosters unity in society.

 

తదుపరి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మేయర్ పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం తీజ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ ఉత్సవ వేడుకలను ఆస్వాదించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. గోర్ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

The Teej festival fosters unity in society.