Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 3:55 pm Posted by : ramakrishna

విద్యార్ధిని చితకబాదిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి

పిడిఎస్యూ  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దుబ్బ హైస్కూల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలును సస్పెండ్ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవన్ లో శుక్రవారం పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సింది పోయి చెయ్యి విరిగేలా కొట్టడం సరైనది కాదని, వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఇలాంటి ఘటన  జరగటం ఆ విద్యార్థి జీవితంతో చెలగాటం ఆడటమేనని అన్నారు.  విద్యార్థికి న్యాయం చేయాలని, ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని , ఇటువంటి ఘటనలు  జరగకుండా చూడాల్సిన చర్యలు  బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు దేవిక,మనోజ్,రాజు,విజయ్ తదితరులు పాల్గొన్నారు.