Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 4:11 pm Posted by : ramakrishna

రాష్ట్రస్థాయి పోటీలలో ఏర్గట్ల విద్యార్థుల ప్రతిభ

బతుకమ్మ,ఏర్గట్ల :బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు వారు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో ఏర్గట్ల విద్యార్థులు ప్రతిభ చాటి అనేక బహుమతులు గెలుపొందారు.కథ పోటీలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అభిలాష్ రాసిన కథకు మొదటి బహుమతి రాగ,వచన కవిత్వం పోటీలలో ఏడవ తరగతి చదువుతున్న రూపక్ కి మొదటి బహుమతి లభించింది,అదేవిధంగా ఉపన్యాస,  ఏకపాత్ర అభినయాలలో ఏడవ తరగతి చదువుతున్న రాజేష్ కి మొదటి బహుమతి లభించింది.కథ పోటీలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న రిశ్వంత్ కి ప్రోత్సాహక బహుమతి లభించింది. హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి శాంత వసంత ట్రస్ట్ అధ్యక్షులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.కె.ఐ వరప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణ చారి, సాహిత్య పరిషత్తు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, చేతుల మీదుగా నగదు బహుమతినీ,జ్ఞాపిక, ప్రశంస పత్రాలను విద్యార్థులు అందుకున్నరని, ఏర్గట్ల పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. రాష్ట్రస్థాయి లో బహుమతులు అందుకున్న విద్యార్థులను ఏర్గట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి, పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులను అభినందించారు.