Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 4:09 pm Posted by : ramakrishna

అక్రమాలకు తావివ్వకుండా సర్వేను పూర్తి చేయాలి

  • నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 
  •  సులేమన్ నగర్ గ్రామపంచాయతీని తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

రుద్రూర్, బతుకమ్మ : ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా  గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  సూచించారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న ఇందిరమ్మ సర్వేను పరిశీలించారు. సర్వే ఎలా చేస్తున్నారని, సర్వే చేసే సమయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇప్పటివరకు ఎన్ని గృహాలు సర్వే చేశారు.. అన్న వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. యాప్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఉన్న నిరుపేదలందరి వివరాలను సేకరించి అర్హులైన వారికి గుర్తించాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాలని ఎక్కడ తప్పులు దొరకకుండా అక్రమాలకు తావివ్వకుండా సర్వే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రుద్రూర్ తహసిల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు తదితరులు ఉన్నారు.