సారించిందే నిఘా.. ఇచ్చిందే నివేదిక
. ఇన్ఫర్మేషన్ ఫర్ సేల్.. నిఘా సంస్థల నయా ట్రెండ్ . అధికారులకు తప్పుడు నివేదికలు . ఫలితంగా ఉత్తుత్తి విచారణలు. . చర్యలు శూన్యం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖకు ఆయువు పట్టులాంటి నిఘా విభాగాల్లో ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయిన కొందరు ముదుర్లు ‘ఇన్ఫర్మేషన్ ఫర్ సేల్..’ అంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లీగల్ దందాలకు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతోపాటు కాన్ఫిడెన్షియల్ డాటానూ ఇతరులకు చేరవేస్తున్నారని శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. నిఘా విభాగాల్లోని కిందిస్థాయి నుంచి వచ్చే నివేదికలు లోపభూయిష్టంగా ఉంటుండడం జిల్లా పోలీసింగ్...