Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:11 pm Posted by : ramakrishna

లొంగిపోయిన బండి భగీరథ్

 

. . . బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు

 

. . . లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ ఎట్టకేలకు లొంగి పోయాడు. శనివారం న్యాయ వాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగి పోయాడు. బండి భగీరథ్​పై నమోదు అయిన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఓ బాలికను లైంగికంగా వేధించాడని అతడిపై మే 8న కేసు నమోదు అయింది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణకు హాజరు కావాలని సిట్​ అధికారులు నోటీసులు పంపినా భగీరథ్​ స్పందించలేదు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించాడు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడం, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో భగీరథ్​ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుతో ఆయన తండ్రికి ఇప్పటికే భారీగా పొలిటికల్ డ్యామేజీ అయింది. ముఖ్యంగా బీఆర్​ఎస్​ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో భగీరత్​ లొంగిపోయారు.

న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది : బండి సంజయ్

తన కుమారుడు లొంగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అన్నారు. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగిందన్నారు. ఏ తప్పూ చేయలేదని భగీరథ్‌ అంటున్నాడని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని సంజయ్​ తెలిపారు.