Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 4:43 pm Posted by : ramakrishna

హిందూ ఏక్తా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ కథ ప్రవచనం   

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ :  ఈనెల14, 15, 16 తేదీలలో హిందూ ఏక్తా సమితి ఆధ్వర్యంలో శ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ చేత శ్రీ రామ కథ ప్రవచనం రోజు మధ్యాహన్నాం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని సమితి సభ్యులు తెలిపారు. ఇందూరు నగరంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని,  గోమాతని రాష్ట్రమాతగా అధికారికంగా ప్రకటించాలని శ్రీ ప్రేమ్ నారాయణ్ మారాజు అయోధ్య నుండి బయలుదేరి గత రెండు సంవత్సరాలుగా దేశం మొత్తం తిరుగుతూ గురువారం ఇందూరు నగరానికి చేరుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు  రామ కథ పారాయణాన్ని తిలకించి మాహరాజు ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు శోభాయాత్ర రైల్వే గెట్ గోశాల నుండి కొత్త గంజ్ లోని ఉమామహేశ్వర మందిరం వరకు కొనసాగుతుందన్నారు. ఈకార్యక్రమంలో అధికంగా భక్తులు పాలుకొని విజయవంతం చేయవలడిందిగా కోరారు. ఈకార్యక్రమంలో రామ్ స్వరూప్ దాలియా, వల్లబ్ సర్దాజి, అనిల్ కధం హిందూవాహిని జిల్లా సంయోజక్, వీహెచ్పీ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, వీహెచ్పీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ జి, దినేష్ తోమార్ జి, పవన్ కుమార్ ముందుడా, దాత్రిక రమేష్, రాంప్రసాద్ చెటర్జీ,అనిల్ గైమ,విజయ్ వ్యాస్ పాల్గొన్నారు.