తుపాన్ వ్యాన్ బోల్తా
శ్రీ చైతన్య విద్యార్థులకు గాయాలు కామారెడ్డి , బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో తుపాన్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులను ఇంటికి తీసుకువెలుతున్న తుపాన్ వ్యాన్ పాఠశాలకు 300 మీటర్ల దూరంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారులు కోలుకుంటున్నారు....