Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 7:09 pm Posted by : ramakrishna

తుపాన్ వ్యాన్ బోల్తా

  • శ్రీ చైతన్య విద్యార్థులకు గాయాలు

 

కామారెడ్డి , బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో  తుపాన్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులను ఇంటికి తీసుకువెలుతున్న తుపాన్ వ్యాన్ పాఠశాలకు 300 మీటర్ల దూరంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి  తరలించారు. దాదాపు 15 మంది వరకు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన చిన్నారులు కోలుకుంటున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వలననే స్కూల్ వ్యాన్ బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

The storm van overturned