Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 8:31 pm Posted by : ramakrishna

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది

 

. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

బోధన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీటవేస్తుందని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాదించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ మండలంలోని బేలాల్ గ్రామంలో 200 కోట్ల అంచనాల వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేసారు.

 

The state government places a high priority on education.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో మొదటి విడతలో గురుకుల పాఠశాల మంజూరు కావడం మన జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో 20 కోట్లతో పాఠశాలలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్థలం మంజూరు కావడం తన అదృష్టమని తెలిపారు.

 

The state government places a high priority on education.

 

విద్యార్థులు ఈ గురుకుల పాఠశాలో బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని అశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు.

 

The state government places a high priority on education.

 

కాంట్రాక్టర్లు భవాన్ని నాణ్యతతో నిర్మించాలన్నారు. విద్యార్థులను కలవడానికి వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి భవనం నిర్మించడం జరుగుతుందన్నారు. అనంతరం 10వ తరగతి పరీక్షలలో 600 మార్కులకు 587 మార్కులు సాదించిన విజయసాయి ను అభినందించారు. ఈ సమావేశంలో ఉర్దు అకాడమి చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలిప్ కుమార్, ఆర్డిఓ రాజేందర్, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్, సంబందిత అధికాలు పాల్గొన్నారు.

 

The state government places a high priority on education.