ఇందూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహా సభలను జిల్లా రైతాంగం, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25,26,27 తేదీల్లో మాధవ నగర్ లోని బి ఎల్ ఎన్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆహ్వాన సంఘం రాష్ట్ర కోశాధికారి కంజర భూమయ్య మాట్లాడుతూ జాతీయస్థాయిలో రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడవ మహాసభలను నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతున్నదని చెప్పారు. 25 న ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, 26, 27 న రాష్ట్ర మహాసభలు ఉంటాయనారు. జిల్లాలోని ప్రజలు, వ్యాపారస్తులు మహాసభల విజయవంతానికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షుడు పి.సుధాకర్, కార్యదర్శులు పి.ముత్యాలు, పి.రంజిత్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి అడ్డికే. రాజేశ్వర్ పాల్గొన్నారు.