Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 9:29 pm Posted by : ramakrishna

ఆత్మీయ సమ్మేళనం అమోఘం

  • 30 సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల కలయిక
  • గురువులను సన్మానించిన విద్యార్థులు

 

వేల్పూర్, బతుకమ్మ : మూడు దశబ్దల తరువాత తాము చదువుకొన్న తోటి విద్యార్థిని, విద్యార్థులు, గురువులతో కలిసిన ఆత్మీయ సమ్మేళనం అమోఘం. జిల్లా పరిషత్ రామన్నపేట్ హై స్కూల్ లో 1994-95 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం స్థానిక మోటాడిరెడ్డి ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించుకొన్నారు.ముందుగా శ్రీసరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వన చేసి విద్యా భోధన చేసిన గురువులకు పూలమాలలు వేసి షాలువాలతో సన్మానించిన జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ఆహ్వానించి సన్మానించడం చాలా ఆనందంగా ఉందని, గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మిన్న అని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మీ జీవితం సుఖశాంతులతో ఉంటూ చక్కగా స్థిరపడాలని పూర్వ విద్యార్థులకు హితవు పలికారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో గురువులు శ్రీ రామోజీ రాములు (రామన్నపేట్), మగ్గిడి శంకర్ (మోర్తాడ్), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఆర్. శివాజీ (బోధన్) పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రేగుల్ల మంజుల, నాగ లత, శ్యామల, విజయలక్ష్మి, సాయమ్మ మహిళా ప్రతినిధులుగా వ్యవహరించారు. పిట్ల గణేశ్, జాగిరపు శోభన్ రెడ్డి, కంకణాల రవి, జాగిరపు మోహన్ రెడ్డి, గుమ్ముల రమేశ్, గడ్డం మహేశ్, రాజా రమేష్, పెద్దోళ్ల (జాగిరపు) సుదాం రెడ్డి, తీగల సంతోశ్, కుంట శ్రీనివాస్, పల్లికొండ గూండ్ల నరేశ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

The spiritual union is wonderful.