Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 7:53 pm Posted by : ramakrishna

సేవా భావం మనస్సు నుంచి రావాలి

  • జిజి కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం

 

ఇందూర్, బతుకమ్మ: కష్టాలలో ఉన్న వారికి సేవ చేయాలనే భావన మనస్సు నుంచి రావాలని గిరిరాజ్ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇప్ప వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఆకుల కొండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిభిరం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంత్రిక యుగంలో మనిషి యంత్రంలా మారకుండా బంధుత్వాలను నిలుపుకోవాలని సూచించారు. జాతీయ సేవా పథకంలో విద్యార్థులు వాలంటీర్లుగా చేయడం అదృష్టంగా భావించాలని చెప్పారు. దీనికి కో ఆర్డినేటర్ గా ఉన్న వెంకటరమణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామనే తపనతో ఉండడంతోనే ఎన్ఎస్ఎస్ ముగింపునకు పిలువగానే వచ్చానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమా మాట్లాడుతూ వాలంటీర్లు వారం రోజులుగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే గాకుండా, వివిధ అంశాలపై అవగాహనా కల్పించడం అభినందిచ్చదగ్గ విషయమన్నారు. ఇదే స్పూర్తితో ప్రజల సమస్యలను నెరవేరుస్తామని హామీ ఇస్తూ వాలంటీర్ల పనితనాన్ని ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, గ్రామ పెద్దలు సుమన్, గణేష్, దేవదాస్, జయ ప్రసాద్ పాల్గొన్నారు.

The spirit of service must come from the mind.12369