Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 5:28 pm Posted by : ramakrishna

జాతి సిగలో మెరుపులు సంచార బిడ్డలు

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : సంచార బీసీ బిడ్డలు జాతిసిగలో మెరుపులని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జనగామ లోని పెంబర్తిలో పూసలోళ్ల అక్కచెల్లెండ్లు తనకు అపురూపంగా గాజులు తొడిగారని అన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలను కవిత రూపంలో ఎక్స్ వేదికగా ఆమె పంచుకున్నారు.

The sparks in the race are nomadic children

జాతి సిగలో మెరువులు సంచార బిడ్డలు

జీవన మాధుర్యపు బంధువులు

ప్రేమైక జీవన సారథులు..

సాంప్రదాయ సౌందర్యపు ప్రతీకలు..

పూసలగంప పూల పుప్పొడి స్వచ్ఛతకు లోగిలి..

తెలంగాణ చేతివృత్తుల చేతనం..

ముత్తయిదు గాజుల మురిపెం..

మన జనగామ పెంబర్తిలో మా పూసలోళ్ల అక్కాచెల్లెండ్లు నాకు అపురూపంగా గాజులు తొడిగిండ్లు.

జయహో పూసలక్క.. జయహో బీసీ..

The sparks in the race are nomadic children