Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 12:17 pm Posted by : ramakrishna

తెయూలో మళ్లీ పాము ప్రత్యక్షం

డిచ్ పల్లి, బతుకమ్మ:  తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ పాము ప్రత్యక్షమైంది. యూనివర్సిటీ లైబ్రరీలో సోమవారం రాత్రి విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో పాము వచ్చింది. దీంతో విద్యార్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. రెండు రోజుల క్రితం సీఎస్ బిల్డింగ్ లోకి పాము వచ్చిన ఘటన మరువకముందే మళ్లీ పాము ప్రత్యక్షం కావడంతో కలకలంరేపింది. విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.