కంపు కొడుతున్న బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్

నీటి వనరు ఉన్నప్పటికిని మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్ కంపు కొడుతుంది. బస్టాండుకు నీటి వనరు బోరు పనిచేస్తున్నప్పటికిని మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక దుర్వాసనతో ప్రయాణికులు ముక్కు మూసుకుంటున్నారు. ఈ బస్టాండులో మొత్తం 30కి పైగా షాపులు అద్దెకు ఇచ్చారు. వీటినుంచి ఆదాయం నెలకు సుమారు 3 లక్షలకు పైనే వస్తుంది. ఇంత ఆదాయం వచ్చే బస్టాండ్ కు ప్రయాణికులు...