Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 7:15 pm Posted by : ramakrishna

ఓట్ చోర్.. గద్దె చోడ్.. నినాదం గడప గడపకు తీసుకెళ్లాలి

  • ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూని చేస్తుంది
  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
  • మాసాని చెరువు నుండి నిజాంసాగర్ కెనాల్ కు నీళ్లు విడుదల

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ  ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిందని రాహుల్ గాంధీ నిరూపించారని, ఓట్ చోర్.. గద్దె చోడ్.. నినాదంతో  ప్రతి వాళ్లకు గడప గడపను తీసుకెళ్తామని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి   అన్నారు. భారతదేశ రాజ్యాంగం గొప్పదని, అనేకమంది  మహనీయుల త్యాగాల వల్ల స్వాతంత్రం  వచ్చిందని, మన దేశం కోసం  కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ  త్యాగాలు చేశారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత  రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి  అధ్యక్షునిగా బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ  నియమించింది అని అన్నారు. బిజెపి ప్రభుత్వం  కర్ణాటకలో  90 వేల దొంగ ఓట్లు కొత్తగా చేర్చారని, బీహార్లో  చాలా ఓట్లు తొలగించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధన్ భాగంగా   గ్రామ గ్రామాన గడపగడపకు వెళ్లి ఓట్ చోర్.. గద్దె చోడ్ అనే నినాదంతో ముందుకు సాగుతూ ప్రజలకు వివరిస్తామని అన్నారు. అలాగే మోపాల్ మండలం న్యాల్కాల్ గ్రామంలో ని మాసాని చెరువు  కు అలీ సాగర్ లిఫ్ట్ నుంచి నీటి విడుదల చేయగా, శుక్రవారం రోజు చెరువు నుండి కాల్వకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  నీటిని విడుదల చేశారు. పదిహేను వేల ఎకరాలకు  పంట పొలాలకు ఈ నీరు చేరుతుందని అన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ తో మాట్లాడిన తర్వాత   నీటిని వదలడం జరిగిందని,రైతుల రైతులు సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇచ్చినమని, వదిన నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని పంట పొలాలు సరిపోయేంత వాడుకోవాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీ ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రాథమిక  సహకార సంస్థలు తీరు బాగుందని లాభాల్లో ఉన్నాయని అన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు రుణమాఫీ రైతు భరోసా వంటి  పథకాలను అమలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, సొసైటీ చైర్మన్  మోహన్, మండల అధ్యక్షులు సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ రావు, సతీష్, పెద్ద ఎత్తున రైతులకు పాల్గొన్నారు.

The slogan "Ot Chor.. Gadde Chod.. Gadapa Gadapa" should be taken from door to door