ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కమ్మర్పల్లి, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమ్మర్పల్లి, ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటరు జాబితాతో...