పట్టణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పట్టణ ప్రాంతాలలో ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా జరిగిందని, తెలంగాణలోనూ వేగవంతం చేయాల్సి...