Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 8:59 pm Posted by : ramakrishna

రజతోత్సవ సభ రాష్ట్రానికి వెలుగునిస్తుంది

  • బహిరంగ సభకు ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తారు

 

బతుకమ్మ భిక్కనూరు: ఈనెల 27న వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ రాష్ట్రానికి వెలుగునిస్తుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం భిక్కనూరు మండలంలోని రెడ్డి ఫంక్షన్ హాల్  లో ముఖ్య నాయకులతో సన్నహాక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ పుట్టి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం 25 సంవత్సరాల్లో విజయవంతంగా అడుగుపెడుతున్న సందర్భంగా అధినేత కేసిఆర్ గారి పిలుపుమేరకు ఏప్రిల్ 27న నిర్వహించబోయే టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందే మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తునికి వేణు, ఎంపీటీసీ సాయి రెడ్డి, బోండ్లరామచంద్రం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

The Silver Jubilee Celebration will shine a light on the state