నర్సరీలపై నిర్లక్ష్యపు నీడ
. ఎండిపోయిన మొక్కలు . ప్రజాధనం వృథా . పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ: అటవీ సంపదను పెంచాలను లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నర్సరీల్లో మొక్కలను పెంచి ప్రతి ఏడాది గ్రామాలు, పట్టణాల్లో మొక్కలను నాటుతున్నారు. అయితే నర్సరీల పై అధికారుల పర్యవేక్షణ కరువుకావడంతో మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నర్సరీలో పచ్చగా కళకళలాడాల్సిన మొక్కలు జీవం కోల్పోతున్నాయి. ప్రజాధనం వృథా అవుతున్నా...