. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
హోంగార్డు అంటే కేవలం ఒక విభాగం కాదు అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు. మన దేశ సరిహద్దుల్లో సైన్యం తో పాటు మన రాష్ట్రం లోపల పోలీసులు ,ఇతర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి చేస్తున్న సేవలు వెలకట్టలేనిది అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. 63వ హోమ్ గార్డ్ రైసింగ్ డే కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హజరయ్యారు. ఉదయం హోమ్ గార్డ్ పరేడు కార్యక్రమం గౌరవ వందనం స్వీకరించిన, పరేడ్ కార్యక్రమం వీక్షించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి హోం గార్డు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1946 డిసెంబర్ 6 న ముంబై లో హోమ్ గార్డ్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. వీరి సేవలు శాంతి భద్రతలకు, ప్రకృతి విపత్తులు, రవాణా , ట్రాఫిక్ నిర్వహణ ” ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర అసాధారణమైనది అన్నారు. గతంలో ఎన్నికల బందోబస్తు. పండుగల నిర్వహణలో, కోవిడ్-19 పరిస్థితిలో వీరి కృషి అనితర సాధ్యం అని పొగిడారు. హోంగార్డులకు మెడికల్ గ్రాంట్ రూ 10,000 చొప్పున 6 గురు మంజూరు చేయబడిందని, కరోనా సమయంలో 131 మందికి రూ. 5,000చొప్పున ఇవ్వడం జరిగిందని, రోజువారి భత్యం రూ. 921 నుంచి రూ. 1000/- పెంచబడిందని తెలిపారు . రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సౌకర్యం, డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీమ్ అందించే ప్రస్తావన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వీరి సంక్షేమ చర్యలలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి మరియు ఆక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వైద్య బీమా సౌకర్యం (రూ 33,00,000 వైద్య బీమా కవరేజీ ) కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం ఈ మధ్య కాలంలో విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన 20 మంది హోమ్ గార్డ్స్ కు ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డు కూడా సిబ్బంది అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ (హోమ్ గార్డ్స్ ), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ), శ్రీనివాస (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్ ). ఆర్.ఎస్.ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.