Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 8:56 pm Posted by : ramakrishna

సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివి

 

. . . తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివి అని ఎమ్మెల్యే పోచారం అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్స్ లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 287 వ అధికారిక జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం పాల్గొన్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని బంజారా సంఘం నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సోదర సోదరీమణులందరికీ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సేవలాల్ మహారాజ్ జన్మించింది బంజారా కుటుంబంలో అయినా అందరికి ఆదర్శంగా నిలిచారని, సేవలాల్ మహారాజ్ కారణజన్ములని, వారి సందేశం, బోధనలు, సూచనలు నాటికి, నేటికి అందరికీ ఆదర్శమని, మనం అందరం ఆచరించాలని, సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విదంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ నియోజకవర్గ మండలాల బంజారా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

The services rendered by Sevalal Maharaj are unforgettable.