Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:32 pm Posted by : ramakrishna

ఎస్ఆర్ సర్వేను పూర్తి చేసిన వారి సేవలు అభినందనీయం

 

. . . నందిపేట్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం లింగం

 

నందిపేట్, బతుకమ్మ :

 

గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరు వివరాలను సేకరించి, బాధ్యతాయుతంగా ఎస్ఐఆర్ సర్వేను పూర్తి చేసిన బీఎల్‌ఓలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల సేవలు అభినందనీయమని నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం కొనియాడారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వేను విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌ఓలు, వీవోలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను మంగళవారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిపేట్ గ్రామం సుమారు 10,200 మందికి పైగా ఓటర్లతో ఉన్న అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటని తెలిపారు. సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్లే సర్వేను నిర్దేశిత సమయంలో 100 శాతం పూర్తి చేయడం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటరు జాబితా సవరణకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ ఉపసర్పంచ్ చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు చింత శ్రీనివాస్, పెట్ల శ్రీనివాస్, బీఎల్‌ఓలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.