Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:02 pm Posted by : ramakrishna

శాంతి భద్రత పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం

 

. . . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి సేవా పతకాలు అందచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేతుల మీదుగా మొత్తం 19 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సి.ఎస్.బి. నిజామాబాద్‌కు చెందిన ఎస్.ఐ. ఎస్.సంతోష్ రెడ్డికి మహోన్నత సేవా పతకం అందచేశారు. అలాగే ఏ.ఎస్.ఐ. టి.నాగభూషణం (ఇందల్వాయి పీఎస్), ఏ.ఎస్.ఐ. షేక్ గఫర్ (నవీపేట్ పీఎస్), హెడ్ కానిస్టేబుల్ బి. జగదీశ్వర్ (సి.ఎస్.బి)లకు ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. అదేవిధంగా ఇన్స్ పెక్టర్ బి. శ్రీనివాస్, ఎస్.ఐలు బి. శివరాం, ఏ. ఆనంద్ సాగర్, ఖాన్ హబీబ్, పి. రాజేశ్వర్, పి. సంజీవరావు, జి. ఉదయ్ కుమార్, ఎం. విట్టల్ రావు, ఏ.ఎస్.ఐలు ఎస్. రాజేందర్, మహమ్మద్ అబ్దుల్ రహీం, హెడ్ కానిస్టేబుళ్లు పి. రాజేశ్వర్, పి. మోహన్, బిస్మిల్లా బేగ్, అలాగే పోలీస్ కానిస్టేబుళ్లు సి.హెచ్. సుభాష్, కె. రామారావులకు సేవా పతకాలు అందచేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించి సత్కరించడం ద్వారా ఇతరులకు కూడా స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. పతకాలు అందుకున్న అధికారులు, సిబ్బందిని జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు అభినందించారు.

 

The services of the police in maintaining peace and security are commendable.