లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి సేవలు అభినందనీయం
రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ -320 డి ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకొని అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి ఆశ్రమంలో చికిత్సలు చేసే వైద్యులకు శాలువాతో ఘనంగా సన్మానించారు....