రుద్రూర్, బతుకమ్మ :
లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ -320 డి ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకొని అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకృతి ఆశ్రమంలో చికిత్సలు చేసే వైద్యులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రుద్రూర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో చిన్నారులకు బిస్కెట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండూరి ప్రశాంత్ గౌడ్, సెక్రటరీ గెంటిల గంగాధర్, ట్రెజరర్ పార్వతి ప్రశాంత్, డిస్ట్రిక్ చైర్మన్ కేవి.మోహన్, జిఎస్టి లయన్ శ్యాంసుందర్ పహడే, లయన్స్ క్లబ్ మెంబర్లు పుట్టి సాగర్, మచ్కురి రమేష్, ప్రశాంత్ గౌడ్, తాహెర్, శామీర్, పుట్టి సందీప్, బచ్చు శ్రావణ్, సాయి కుమార్, గాండ్ల శ్రావణ్, జువ్వల శ్రావణ్, ప్రకృతి ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
