లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

రుద్రూర్, బతుకమ్మ: లయన్ స్టిక్ సంవత్సరంలో మొదటి రోజుని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ గ్రామాలల్లో 10 సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో దాదాపు 150 మందికి ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద  అల్పాహారాన్ని అందించడం జరిగింది. అనంతరం దేవిదాస్ రావు గోశాలలో గోవులకు దాన వితరణ చేశారు. తదుపరి వీధి శూనకాలకు ఆహారం అందించడం జరిగింది.  అనంతరం మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో 11 మొక్కలను నాటారు.  యోగా హాల్లో రోగులకు యోగ అవగాహన...