Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:28 pm Posted by : ramakrishna

హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సేవలు హర్షనీయం

 

. . . ఎంపీడీవో బాల కిషన్

 

వేల్పూర్ బతుకమ్మ :

 

నేటి యువత కు హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆదర్శమని ఎంపీడీవో బాల కిషన్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కాంప్లెక్స్ లో మంగళవారం నిర్వహించిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సంజీవ్ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సేవా కార్యక్రమాలలో ముందుండాలని అసోసియేషన్ వారు చేస్తున్న సేవలను కొనాయాడారు. అనంతరం సర్పంచ్ మొండి అశోక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా పేదలకు ఆరోగ్య అవసరాల నిమిత్తం, విద్య కోసం అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గ్రామాలలో వారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ తన వంతుగా అసోసియేషన్ కి రూ. 10వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బత్తుల మాణిక్యం, హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.