Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 6:53 pm Posted by : ramakrishna

ఆపద మిత్రుల సేవలు అద్భుతం

  • ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం  చేస్తు..

 

మోర్తాడ్, బతుకమ్మ: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరగకుండా ఎలా కాపాడాలని ఆపద మిత్రులకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎటువంటి నష్టాలు జరగకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆపద మిత్రులు అద్భుత రీతిగా తమ విధులను నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ మండలం కు చెందిన ఆపద మిత్రుడు మహేష్ కుమార్ ధర్మోరా, పాలెం గ్రామాల మధ్యన ఉదృతంగా పాడుతున్న పెద్దవాగు దగ్గర పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ అధికారులతో తన సేవలందించారు. అలాగే తడపాకల్ గోదావరి నది పరవాక ప్రాంతం వద్ద ఆపద మిత్రులు ఏర్గట్ల శేఖర్, ఏర్గట్ల గంగాధర్ పరివాహ ప్రాంతం వైపు ఎవరు రాకుండా నష్టాలు జరగకుండా తమ వంతు సేవలందించారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఆపద మిత్రులు ఎక్కడివారు అక్కడ తమ విధులను సక్రమంగా నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూపులలో షేర్ చేస్తూ అధికారులకు తెలియజేశారు. ఉన్నత అధికారులు స్పందించి ఆపద మిత్రులకు ఐడి కార్డులు, భద్రత కిట్టు అందిస్తే బాగుంటుందని శిక్షణ తీసుకున్న ఆపద మిత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

The services of the emergency friends are wonderful