Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 4:29 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయుల సేవలు మరవలేనివి

  • ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

బతుకమ్మ, నిజామాబాద్ :  ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో డా. పుప్పాల రవి సభాధ్యక్షతన ముఖ్య అతిథి గా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్న కార్యక్రమంలో 25 మంది జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు శాలువా, మెమెంటో తో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గా షబ్బీర్ అలీ మాట్లాడుతూ  దాదాపు 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 వేయిల పదోన్నతులు మరియు దాదాపు 6 సంవత్సరాలుగా లేని బదిలీలను వెంటనే చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి, తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చామన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ వేణు, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ గొడుగు గంగాధర్, పంచారెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు.