పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవి
ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బతుకమ్మ,మద్నూర్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాల్లో భాగంగా మద్నూరు ఉమ్మడి మండల పరిధిలోని గ్రామపంచాయతీ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జు క్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల శుభ్రత పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. గ్రామాల...