Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 5:00 pm Posted by : ramakrishna

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవి

ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

బతుకమ్మ,మద్నూర్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాల్లో భాగంగా మద్నూరు ఉమ్మడి మండల పరిధిలోని గ్రామపంచాయతీ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు  చేశారు. ఈ కార్యక్రమానికి  జు క్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల శుభ్రత పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. గ్రామాల శుభ్రత పట్ల గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా వారి ఆరోగ్యాల పట్ల ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. గ్రామాల శుభ్రత పట్ల మీ సేవలు ప్రభుత్వం గుర్తిస్తుందని, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందని, మీ సేవలు గ్రామాల శుభ్రతపై మరింతగా అందించి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందాలని సూచించారు. కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు.

The services of sanitation workers are invaluable

అంతకు మొదలు బాన్సువాడ డిఎల్పిఓ మద్నూర్ మండల ప్రత్యేక అధికారి నాగరాజు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 167 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వీటి పరిధిలో 700 పైన కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్మికుల కుటుంబాలకు మూడు రకాల ఇన్సూరెన్స్ అమలు కోసం కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు ఇన్సూరెన్స్ తో పాటు గుర్తింపు కార్డులు అందజేస్తామని డిఎల్పిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీ ఓ వెంకట నరసయ్య, ఎంఈఓ రాములు నాయక్, ఏపీవో పద్మ, ఏపిఎం మనోహర్, గ్రామ కార్యదర్శుల యూనియన్ నాయకులు భాస్కర్, మండల నాయకులు ప్రమోద్, డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

The services of sanitation workers are invaluable