Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:27 pm Posted by : ramakrishna

ఇందిరాగాంధీ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి

 

. . . జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళ్ళు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారతదేశ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆమెను ప్రపంచం మొత్తం “భారత ఉక్కు మహిళ” అని పిలుస్తుంది అని, 1966లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిర,  క్లిష్ట సమయాల్లో ధైర్యమైన, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు.దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చడానికి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి భారతదేశాన్ని స్వయంసమృద్ధి వైపు తీసుకెళ్లారన్నారు. అలాగే భారత ఉక్కు మనిషి”  స్వర్గీయ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఆయన జయంతిని మనం “జాతీయ ఐక్యతా దివస్ గా జరుపుకుంటామన్నారు. చిన్ననాటి నుంచే ఆయన ధైర్యసాహసాలు, పట్టుదల కలిగిన వ్యక్తి. స్వతంత్ర భారత దేశ తొలి ఉప ప్రధానిగా, తొలి హోం మంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలు అపారమైనవి అన్నారు.ముఖ్యంగా హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ వంటి సంస్థానాలను భారత్‌లో కలిపిన తీరు ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. గాంధీజీ ప్రారంభించిన బార్డోలీ సత్యాగ్రహంలో రైతులకు నాయకత్వం వహించి విజయం సాధించినందుకే ఆయనకు ప్రజలు “సర్దార్” (నాయకుడు) అనే బిరుదును ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎఐసిసి కో ఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా ఉపాధ్యక్షులు కౌదపు శరత్, నగర ఉపాధ్యక్షుల అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, బంటు బలరాం, మహిళ నాయకులు పోలా ఉష,చంద్రకళ, విజయలక్ష్మి, స్వప్న, ఆమరాజు, పోలా శంకర్, ఆదే ప్రవీణ్, తదితరుల పాల్గొన్నారు.